మరోసారి 'తప్పు'లో కాలేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పొరబడ్డారు. శ్రీలంక మారణహోమంలో బలైన వారికి సానుభూతి తెలుపుతూ ఆయన ఓ ట్వీట్ చేశారు. అందులో మృతుల సంఖ్యను 138కి బదులుగా 138 మిలియన్ ప్రజలు అని తప్పుగా పేర్కొన్నారు. ఆ తరువాత ట్రంప్ తన తప్పు సరిదిద్దుకున్నారు.
"ఉగ్రవాద దాడిలో బలైన శ్రీలంక ప్రజలకు అమెరికా ప్రజల తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చర్చిలు, హోటళ్లలో జరిగిన వరుస బాంబు దాడుల్లో సుమారు 138 మంది మరణించారు. 600 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారికి మా
సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాం."-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్వీట్
మరోసారి 'తప్పు'లో కాలేసిన డొనాల్డ్ ట్రంప్
అంతకు మునుపు చేసిన ట్వీట్లో మృతుల సంఖ్యను 138 మిలియన్లని తప్పుగా పేర్కొన్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తప్పును సరిదిద్దుకోవాడానికి సుమారు 20 నిమిషాలు తీసుకున్నారు.
ఇదేం కొత్త కాదులే....!
ట్రంప్ ట్వీట్ చేసేటప్పుడు పొరపడటం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు మునుపు అమెజాన్ సీఈఓ 'జెఫ్ బెజోస్' పేరును 'జెఫ్ బెజో' అని తప్పుగా రాశారు. ఆపిల్ సీఈఓ 'టిమ్ కుక్'ను 'టిమ్ ఆపిల్' అని సంబోంధించారు. లాక్హీడ్ మార్టిన్ సీఈఓ 'మార్లిన్ హేవ్సన్' పేరును 'మార్లిన్ లాక్హీడ్' గా పేర్కొన్నారు.
ఇదీ చూడండి:శ్రీలంక దాడుల్ని ఖండించిన దేశాధినేతలు