2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి.. మరోసారి ప్రధాని కానున్న నరేంద్ర మోదీకి ప్రపంచదేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తదితరులు ట్విట్టర్లో మోదీకి అభినందనలు తెలిపారు. ప్రముఖుల ట్వీట్లకు స్పందించిన మోదీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
'ప్రధానిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్న మీకు(నరేంద్ర మోదీ) శుభాకాంక్షలు. అమెరికా - భారత్ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషిచేయాలి. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా'
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారని ఐరాస ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు.