తెలంగాణ

telangana

ETV Bharat / international

'అలా చేస్తే 15 నిమిషాల్లోనే నిరసనలు బంద్'

హాంగ్​కాంగ్​ నిరసలపై ఆవేదన వ్యక్తం చేసిన ట్రంప్​.. త్వరలో ఈ అంశంపై చైనా అధ్యక్షుడితో చర్చించనున్నట్టు తెలిపారు. నిరసనకారులతో జిన్​పింగ్​ చర్చలు జరిపితే 15 నిమిషాల్లోనే అల్లర్లు సద్దుమణుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

'అలా చేస్తే 15 నిమిషాల్లోనే నిరసనలు బంద్'

By

Published : Aug 16, 2019, 10:48 AM IST

Updated : Sep 27, 2019, 4:17 AM IST

హాంగ్​కాంగ్​లో కొద్ది నెలలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో చర్చించనున్నట్టు వెల్లడించారు.

ఆందోళనకారులతో జిన్​పింగ్​ చర్చలు జరపాలని అమెరికా అధ్యక్షుడు అభ్యర్థించారు. అలా జరిగితే నిరసనలు 15 నిమిషాల్లోనే ఆగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు.
నేరస్థులను చైనాకు అప్పగించే బిల్లును హాంగ్​కాంగ్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతిపాదించింది. ఫలితంగా... బిల్లును నిరసిస్తూ హాంకాంగ్‌లో ఆందోళనలు చెలరేగాయి.

వాణిజ్య యుద్ధంతో చైనా డీలా...

చైనాతో నెలకొన్న వాణిజ్య యుద్ధంపై స్పందించారు ట్రంప్​. తమ ఆంక్షలతో డ్రాగన్​ దేశం రోజురోజుకూ బలహీనపడుతోందని ట్రంప్​ అన్నారు. వాణిజ్య యుద్ధం ముందుకు సాగే కొద్దీ.. అమెరికా మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.

అయితే అమెరికా- చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరెన్నో రోజులు ఉండదని ట్రంప్​ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయన్నారు.

హాంగ్​కాంగ్​ నిరసనల విషయంపై త్వరలోనే జిన్​పింగ్​తో ట్రంప్​​ చర్చించనున్న నేపథ్యంలో వాణిజ్య యుద్ధం ప్రస్తావనా ఉండే అవకాశముందని అగ్రరాజ్య అధికార వర్గాల సమాచారం.

ఇదీ చూడండి:- శ్రుతిమించితే... ఉద్యమాన్ని అణగదొక్కుతాం: చైనా

Last Updated : Sep 27, 2019, 4:17 AM IST

ABOUT THE AUTHOR

...view details