తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆ పర్వతంపై నా విగ్రహమా? అదేం లేదే!' - ట్రంప్ వార్తలు

అమెరికా జాతీయ స్మారక చిహ్నం మౌంట్ రష్​మోర్​ పర్వతంపై తన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారనే వార్తలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆ కథనాలు అవాస్తమని, కొన్ని పత్రికలు తమ ప్రచారం కోసం అలా చేశాయన్నారు.

Trump
డొనాల్డ్ ట్రంప్

By

Published : Aug 10, 2020, 10:59 PM IST

ఉద్దేశ పూర్వకంగానో లేదా అనుకోకుండానో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు నిత్యం వార్తల్లో ఉండటం పరిపాటి. కాగా ఆ దేశంలోని ప్రఖ్యాత రష్‌మోర్‌ పర్వతంపై ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారనే వార్త ఇటీవల సంచలనం సృష్టించింది. ఆ కథనాలు అవాస్తవమని అధ్యక్షుడు వివరణ ఇచ్చారు.

దక్షణ డకోటాలోని రష్‌మోర్‌ పర్వతాన్ని అమెరికా జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించారు. దీనిపై 60 అడుగుల పొడవున అమెరికా అధ్యక్షులలో ప్రముఖులైన జార్జి వాషింగ్టన్, థామస్‌ జఫర్సన్, థియోడర్‌ రూజ్వెల్ట్‌, అబ్రహాం లింకన్‌ విగ్రహాలు ఉంటాయి.

ఆలోచన బాగుందే!

ఈ రష్‌మోర్‌ పర్వతంపై తన విగ్రహాన్ని కూడా చెక్కనున్నారనే వార్తలను అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు. న్యూయార్క్‌ టైమ్స్‌, సీఎన్‌ఎన్‌ తదితర వార్తా సంస్థలు తమ ప్రచారం కోసం అబద్ధపు వార్తలను ప్రచురిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

తను పదవిలో ఉన్న తొలి మూడున్నర సంవత్సరాల్లో, ఏ ఇతర అధ్యక్షుడి కంటే మిన్నగా అనేక విజయాలు సాధించినప్పటికీ, తానెప్పుడూ ఈ ప్రయత్నం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ ఆలోచనేదో బాగానే ఉందే అని ట్రంప్‌ అనటం కొసమెరుపు!

ఇదీ చూడండి:ట్రంప్​కు '7 కీస్​' గండం- ఎన్నికల్లో ఓటమి తథ్యం!

ABOUT THE AUTHOR

...view details