తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్​ అభిశంసన'లో చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​కు సమన్లు - trump impeachment latest news

అభిశంసన దర్యాప్తులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ పరిపాలన విభాగం చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ మిక్​ ముల్వానికి సమన్లు జారీ చేసింది దర్యాప్తు కమిటీ. రాజకీయ ప్రయోజనాల కోసం ఉక్రెయిన్​పై ట్రంప్​ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించిన విషయంలో ముల్వాని ప్రత్యక్షంగా పాలుపంచుకున్నట్లు పేర్కొంది.

అభిశంసనపై ట్రంప్​కు ఎదురుదెబ్బ..చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​కు సమాన్లు

By

Published : Nov 6, 2019, 8:01 AM IST

అభిశంసన దర్యాప్తులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడి యాక్టింగ్​ చీఫ్​ ఆఫ్​ స్టాఫ్​ మిక్​ ముల్వానికి సమన్లు జారీ చేసింది అభిశంసన దర్యాప్తు కమిటీ. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బిడెన్​ను ఇబ్బంది పెట్టేందుకు.. ఉక్రెయిన్​పై ట్రంప్​ ఒత్తిడి తీసుకువచ్చారన్న ఆరోపణల విషయంలో ముల్వానికి పూర్తి అవగాహన ఉందని అభిప్రాయపడింది.

"అధ్యక్షుడు ట్రంప్​, ఆయన వ్యక్తిగత ఏజెంట్​ రుడాల్ఫ్​ గియులియా.. ఉక్రెయిన్​పై ఒత్తిడి తెచ్చిన విషయంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలింది. అధ్యక్షుడికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఉక్రెయిన్​కు 400 మిలియన్​ డాలర్ల భద్రతా సహాయాన్ని నిలిపివేసేందుకు వారు ప్రయత్నించారు. అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం.. మీరు సాక్షం చెప్పేందుకు హాజరు కాకపోయినట్లయితే అభిశంసన దర్యాప్తును అడ్డుకున్నట్లుగా దీనిని సాక్షంగా పేర్కొంటాం."

- అభిశంసన దర్యాప్తు కమిటీల ఛైర్మన్​.

శ్వేతసౌధం నిరాకరణ..

అభిశంసన దర్యాప్తులో భాగంగా సమన్లు అందుకున్న ముల్వాని... శ్వేతసౌధం అత్యున్నత స్థాయి అధికారి. అధికార విభాగం సిబ్బంది దర్యాప్తునకు సహకరించేందుకు శ్వేతసౌధం నిరాకరిస్తున్న నేపథ్యంలో శుక్రవారం దర్యాప్తు బృందం ముందు ముల్వాని హాజరయ్యే అవకాశం లేదు.

ఉక్రెయిన్​కు సహాయాన్ని స్తంభింపజేసే నిర్ణయం దర్యాప్తు డిమాండ్​తో ముడిపడి ఉందని గత నెలలో ముల్వాని బహిరంగంగా ప్రకటించారు. అనంతర తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

ఇదీ చూడండి: సాండ్​విచ్​ కోసం వాగ్యుద్ధం.. తీసింది ప్రాణం

ABOUT THE AUTHOR

...view details