చైనాపై మరోమారు విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనాను అగ్రరాజ్యానికి చైనాయే పంపిందని ఆరోపించిన ట్రంప్.. ఈ విషయాన్ని తమ దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని తెలిపారు.
ఫ్లోరిడాలో ఎన్నికల ర్యాలీని నిర్వహించిన ట్రంప్.. కరోనాను 'కృత్రిమంగా రూపొందించిన అత్యంత దారుణమైన విషయం'గా అభివర్ణించారు.
"కరోనాతో 22లక్షల మందిని కోల్పోయేవాళ్లం. కాని 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఒక్కరు కూడా చనిపోయి ఉండకూడదు. ఇదంతా చైనా వల్లే. చైనా చేసిన దాన్ని ఎన్నటికీ మర్చిపోము. చైనా.. కృత్రిమంగా రూపొందించిన అత్యంత దారుణమైన విషయం 'కరోనా'. అయితే ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు దేశమంతా ఏకమవుతోంది. ఇది ఓ గొప్ప విజయం."