తాము అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా.. 94.5శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు అమెరికా సంస్థ మోడెర్నా చేసిన ప్రకటనపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తన హయాంలోనే ఇలాంటి గొప్ప ఆవిష్కరణలు జరిగాయని గుర్తుంచుకోవాలన్నారు.
"మరో వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన వెలువడింది. ఈసారి అది మోడెర్నా. 95శాతం ప్రభావవంతం. చైనా వైరస్‌ను అంతం చేసే అవిష్కరణలన్నీ నా హయాంలోనే జరిగాయని చరిత్రకారులందరూ గుర్తుపెట్టుకోవాలి."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
'ఆశ కలగడానికి కారణం..'
మోడెర్నా ప్రకటనపై 2020అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ స్పందించారు. ఇలాంటి ప్రకటనలు భవిష్యత్తుపై ఆశను పెంచుతాయన్నారు.
"రెండో వ్యాక్సిన్‌పై వెలువడిన వార్త.. భవిష్యత్తుపై ఆశలు పెట్టుకునేందుకు ఓ కారణంగా మారింది. రెండు వ్యాక్సిన్లలోనూ ఒకటే నిజమని తేలింది. వ్యాక్సిన్‌కు మనం కొద్ది నెలల దూరంలో ఉన్నాం. అప్పటివరకు అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి, కరోనాను కట్టడి చేసేందుకు మాస్కు ధరించాలి."