ఉత్తర కొరియాతో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇటీవలే ఉత్తరకొరియా ఆయుధాల, క్షిపణి పరీక్ష నిర్వహించినప్పటికీ ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్‌పై నమ్మకం ఉందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2020 అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న జో బిడెన్‌పై కిమ్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సంతోషం కలిగించాయని ట్వీట్ చేశారు.
'ఉత్తర కొరియా కొన్ని ఆయుధాలను పరీక్షించడం కొంతమందిని ఇబ్బంది పెట్టింది. కానీ నేను ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఇచ్చిన హామీలకు కిమ్ కట్టుబడి ఉంటారని నమ్ముతున్నా. జో బిడెన్‌కు జ్ఞాపక శక్తి తక్కువ ఉందన్న ఉత్తర కొరియా వ్యాఖ్యలు సంతోషం కలిగించాయి.?'
---- ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.