అమెరికాలోని మిస్సిసిపి, టెక్సాస్, లూసియానా రాష్ట్రాల్లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ప్రచండ గాలులతో విరుచుకుపడుతూ... వందలాది ఇళ్లను ధ్వంసం చేసింది. టెక్సాస్, లూసియానాలో విపత్తు కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. మిస్సిసిపిలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలి లక్షల మంది అంధకారంలో బతుకున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
వేలాది విమానాలకు తుఫాన్ బ్రేకులు
అమెరికాలో తుఫాన్ విరుచుకుపడుతోంది. భీకర గాలులతో బీభత్సం సృష్టిస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా వేలాదిగా విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
అమెరికాలో తుఫాన్ బీభత్సం
తుఫాన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు గమ్యం చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు.