తెలంగాణ

telangana

ETV Bharat / international

'60 రోజులు కాదు... ఏడాది పాటు హెచ్​1బీలు బంద్'

హెచ్​1బీ సహా కొత్తగా మంజూరు చేసే ఉద్యోగ వీసాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నలుగురు రిపబ్లికన్​ సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను కోరారు. కనీసం ఏడాది పాటు లేదా ఆ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య తగ్గేవరకు ఇలాంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Top Senators urge Trump to temporarily suspend all new guest worker visas
ఉద్యోగ వీసాలు తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రంప్​కు వినతి

By

Published : May 8, 2020, 11:38 AM IST

కరోనా సంక్షోభం దృష్ట్యా విదేశీ ఉద్యోగుల వీసాలను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను కోరారు ఆ దేశ చట్టసభ్యులు. హెచ్​1బీ సహా మరికొన్ని ఉద్యోగ వీసాలను ఏకంగా ఏడాది పాటు లేదా నిరుద్యోగ సమస్య తీరేవరకు సస్పెండ్ చేసి ఉంచాలని అభ్యర్థించారు. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రముఖ సెనేటర్లు టెడ్​ క్రూజ్​, టామ్​ కాటన్​, చక్​ గ్రాస్లే, జోశ్​ హావ్లే ట్రంప్​కు లేఖను రాశారు.

కరోనా మహమ్మారి కారణంగా అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య పెరిగిందని లేఖలో పేర్కొన్నారు సెనేటర్లు. మార్చి ప్రథమార్ధం ముగిసే నాటికి 3.3 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం ధరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు.

ఆర్థిక వ్యవస్థ కోలుకునేంత వరకు అమెరికాలోని నిరుద్యోగులను రక్షించేలా నాన్​-ఇమిగ్రెంట్ గెస్ట్ వర్కర్​ వీసాలను వచ్చే 60 రోజుల పాటు రద్దు చేయాలి. ఈ విభాగంలోని ఇతర వీసాలను ఏడాది పాటు లేదా సాధారణ పరిస్థితులు వచ్చే వరకు నిలిపివేయాలి. హెచ్2బీ, హెచ్​1బీ, ఓపీటీ(చదువు తర్వాత విదేశీ విద్యార్థలకు వీసా గడువు పొడిగింపు), ఈబీ5 ఇమిగ్రెంట్​ వీసాలను కూడా తక్షణమే నిలిపివేయాలి.

-లేఖలో సెనేటర్లు.

హెచ్​1బీ వీసాల ద్వారా భారత ఐటీ ఉద్యోగులే ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఈబీ5 ఇన్వెస్టర్​ వీసా కూడా ఎక్కువగా ఎంచుకుంటారు. వీటిపై ఆంక్షలు విధిస్తే వేలాది మంది భారతీయులపై ప్రభావం పడనుంది. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి మాత్రం వీసాలు మంజూరు చేయవచ్చని సెనేటర్లు తెలిపారు.

2019లో 2,23,000 మందికి పైగా విదేశీ విద్యార్థులు ఓపీటీ వీసా ద్వారా ప్రయోజనం పొందారు. దీని ద్వారా చదువు పూర్తయినా మూడేళ్ల వరకు అమెరికాలో ఉండవచ్చు.

ABOUT THE AUTHOR

...view details