టీకా వేసుకోకపోతే ఉద్యోగులను తొలగించాలనే ప్రభుత్వ నిబంధన కారణంగా అమెరికా నిఘా వ్యవస్థకే ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది. అగ్రరాజ్యం నిఘా వ్యవస్థలోని వివిధ సంస్థల్లో పనిచేసే వేల మంది సిబ్బంది ఇంకా ఒక్క డోసు టీకా కూడా తీసుకోకపోవడమే ఇందుకు కారణం. దీనిపై రిపబ్లికన్ చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరందరికీ ఒకేసారి ఉద్యోగాల నుంచి తొలగిస్తే జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అక్టోబర్ చివరి నాటికి పలు నిఘా సంస్థల్లో ఇంకా టీకా తీసుకోని సిబ్బంది 20శాతానికి పైనే ఉన్నారని రిపబ్లికన్ చట్టసభ్యుడు, ప్రతినిధుల సభ నిఘా కమిటీలోని సభ్యుడు క్రిస్ స్టివార్డ్ వెల్లడించారు.
అమెరికా నిఘా వ్యవస్థలోని 18 సంస్థల్లో కొన్నింటిలో 40శాతం సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోలేదని స్టివర్ట్ తెలిపారు. వీటి పేర్లను మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. కమిటీకి వివరాలు అందినప్పటికీ పరిపాలనా యంత్రాంగం వీటిని ఇంకా బహిరంగంగా ప్రకటించలేదని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులందరూ నవంబర్ 22 నాటికి కచ్చితంగా టీకా తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. అప్పటిలోగా చాలా మంది టీకా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎవరైనా టీకా తీసుకోవడానికి నిరాకరిస్తే వారిని విధులనుంచి తొలగించాల్సి ఉంటుంది. నిఘా వ్యవస్థలో పనిచేసే సిబ్బందిని కూడా ఉద్యోగం నుంచి తప్పిస్తే వారిని భర్తీ చేయడం కష్టమవుతుందని రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. వీరంతా భద్రతా తనిఖీల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారని చెప్పారు.
ఎంతమంది?