ప్రపంచంలోనే అతి పెద్ద నీటి ఆవిరి రైలు అమెరికా షికాగోలో అనేక ఏళ్ల విరామం తర్వాత పట్టాలెక్కింది. 'బిగ్ బాయ్'గా పిలిచే ఈ రైలు పశ్చిమ షికాగో నుంచి అయోవాకు మంగళవారం పయనమైంది. ట్రాన్స్‌కాంటినెంటల్ రైల్‌రోడ్డు సంస్థ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రయాణం చేస్తోంది.
ద బిగ్ బాయ్.. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి ఆవిరి రైలు - పొడవు
పేరు బిగ్‌బాయ్.. 133 అడుగుల పొడవు, 1.2 మిలియన్ పౌండ్ల బరువు. ఎవరబ్బా అనుకుంటున్నారా..? ఓ రైలు. ప్రపంచంలోనే అతి పెద్ద నీటి ఆవిరి రైలుగా రికార్డుకెక్కిన ఈ బండి... చారిత్రక ప్రయాణం ప్రారంభించింది.
ద బిగ్ బాయ్.. ప్రపంచలోనే అతిపెద్ద నీటి ఆవిరి రైలు
133 అడుగులు, 1.2 మిలియన్ పౌండ్ల బరువు కలిగిన రైలు బండిని 1940లో రవాణా సంస్థలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1961లో యూనియన్ పసిఫిక్ రైల్‌రోడ్డు నుంచి విరమణ పొందింది.
యూనియన్ పసిఫిక్ 2013లో బిగ్ బాయ్‌ను పునరుద్ధరించే పని ప్రారంభించింది. అది ఇప్పటికి పూర్తయ్యింది.
Last Updated : Jul 31, 2019, 12:30 PM IST