ఉత్తరాఖండ్‌లో ధౌలీగంగా జల ప్రళయం మిగిల్చన మహా విషాధంపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ విచారం వ్యక్తం చేశారు.
వరద బీభత్సంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జలప్రళయంలో చాలమంది గల్లంతవడం బాధాకరమన్నారు. ఈ సమయంలో భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.