తెలంగాణ

telangana

ETV Bharat / international

'7 కోట్లకు పైగా ఓట్లు సాధించాను- నేనే గెలిచాను' - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘోర పరాభావం చవిచూసినా.. ఇంకా ఓటమిని అంగీకరించడంలేదు డొనాల్డ్ ట్రంప్​. బైడెన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని మరోమారు ఆరోపించారు. 7 కోట్లకుపైగా ఓట్లు సాధించిన తానే గెలిచినట్లు ట్వీట్ చేశారు.

THE OBSERVERS WERE NOT ALLOWED INTO THE COUNTING ROOMS. I WON THE ELECTION
'7 కోట్లకు పైగా ఓట్లు సాధించాను- నేనే గెలిచాను'

By

Published : Nov 8, 2020, 9:11 AM IST

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలనైప్పటికీ డొనాల్ట్ ట్రంప్ తీరు మాత్రం మారడం లేదు. ఇంకా తానే గెలిచానని ట్వీట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, పరిశీలకులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించేలేదని ఆరోపిస్తున్నారు.

ట్రంప్ ట్వీట్​

" 7 కోట్ల 10 లక్షల లీగల్​ ఓట్లు సాధించాను. అమెరికా చరిత్రలో మరే ఇతర సిట్టింగ్​ అధ్యక్షుడికి ఇన్ని ఓట్లు రాలేదు. నేనె గెలిచాను. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి పరీశీలకులను అనుమతించలేదు. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. లక్షలాది మందికి బ్యాలెట్ ఓట్లను అడగకుండానే పంపారు."

- డొనాల్డ్​ ట్రంప్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details