38 మందితో వెళ్తూ 2 రోజుల క్రితం అదృశ్యమైన చిలీ వైమానిక దళ సైనిక విమానం శకలాలను గుర్తించారు అధికారులు. సీ-130 హెర్య్కూలస్ విమానం కోసం సుమారు 70వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో తనిఖీలు చేపట్టాయి బలగాలు. విహంగంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో.. విమానానికి చెందిన 'స్పాంజ్' పదార్థాన్ని గుర్తించినట్లు వైమానిక దళ జనరల్ ఎడ్వర్డో మోస్క్వైరా తెలిపారు. శకలాలపై పరిశోధన చేసి ఏ విమానానికి చెందినవో తేల్చాల్సి ఉందన్నారు.
గత సోమవారం.. చిలీలోని పుంటా ఏరినాస్ నగరం నుంచి వైమానిక విమానం సీ-130 బయలుదేరి అంటార్కిటికా వెళ్లాల్సి ఉంది. డ్రేక్ పాస్ సముద్ర ప్రాంతం మీదుగా వెళుతున్న క్రమంలో కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయి.