తెలంగాణ

telangana

ETV Bharat / international

కమలా హారిస్​ ఇంటి వద్ద సాయుధుడి కలకలం- అరెస్టు - టెక్సాస్​

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​ నివాసం వద్ద రిజిస్టర్​ కాని ఆయుధాలతో తిరుగుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు వాషింగ్టన్ పోలీసులు. ప్రస్తుతం కమలాహారిస్, ఆమె భర్త శ్వేతసౌథం అతిథి గృహంలో ఉంటున్నారు.

Texas man carrying weapon arrested outside Kamala Harris' residence
కమలా హారిస్​ ఇంటి వద్ద ఆయుధాలతో తిరిగిన వ్యక్తి అరెస్టు

By

Published : Mar 18, 2021, 8:54 AM IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం వద్ద.. ఆయుధాలతో తిరుగుతున్న వ్యక్తిని వాషింగ్టన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. మాసాచుసెట్స్ ఎవెన్యూ వద్ద ఆయుధాలతో తిరుగుతున్నట్లు గమనించి సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అధికారిక నివాసంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున.. హారిస్, ఆమె భర్త ఇంకా అక్కడకు వెళ్లలేదు.

ప్రస్తుతం శ్వేతసౌధం అతిథిగృహమైన బ్లెయిర్‌ హౌస్‌లోనే ఉపాధ్యక్షురాలు ఉంటున్నారు. పెద్ద మొత్తంలో ఆయుధాలు తీసుకెళ్తున్న పాల్ ముర్రే అనే వ్యక్తిని ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేసినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. రిజిస్టర్‌కాని ఆయుధాలను అతడు ఎందుకు తీసుకెళుతున్నాడో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:అంగారకుడి గర్భంలో జలసిరి!

ABOUT THE AUTHOR

...view details