కరోనా మహమ్మారి కట్టడిలో మాస్కుల సత్తా మరోసారి రుజువైంది. మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు ఒక వ్యక్తి నుంచి వెలువడే చిన్నపాటి తుంపర్లను అడ్డుకోవడంలో సర్జికల్ మాస్కులు(Surgical masks) సమర్థంగా పనిచేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మాస్కుల అంచుల వద్ద కొద్దిపాటి లీకేజీలు ఉన్నప్పటికీ మొత్తంమీద గాల్లోకి విడుదలయ్యే రేణువులు చాలా తక్కువగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
Surgical masks: కరోనా కట్టడిలో ఈ మాస్కులు మంచివే!
కరోనా మహమ్మారి కట్టడిలో.. సర్జికల్ మాస్కులు సమర్థంగా పనిచేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మాస్కుల అంచుల వద్ద కొద్దిపాటి లీకేజీలు ఉన్నప్పటికీ మొత్తం మీద గాల్లోకి విడుదలయ్యే రేణువులు చాలా తక్కువగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు.
అత్యధిక సమర్థత కలిగిన ఎన్95 వంటి మాస్కులను ముఖానికి బిగుతుగా అతుక్కునేలా డిజైన్ చేస్తారు. సర్జికల్ మాస్కులు, వస్త్రంతో తయారైన ఇతర మాస్కులు ధరించినప్పుడు మాత్రం అంచుల్లో కొంత ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీల గుండా రేణువులు బయటకు వస్తున్న తీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు. మాట్లాడేటప్పుడు 70 శాతం మేర, దగ్గేటప్పుడు 90 శాతం మేర సమర్థతతో సర్జికల్ మాస్కులు పనిచేస్తున్నాయని సిమ్యులేషన్ల ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖాళీల గుండా వెలువడే గాలి వల్ల ఈ మాస్కుల సమర్థత తగ్గుతున్నప్పటికీ స్థూలంగా చూస్తే అవి గణనీయ స్థాయిలోనే రేణువులకు అడ్డుకట్ట వేస్తున్నాయని క్రిస్టోఫర్ చెప్పారు. మాస్కులు.. ఒక వ్యక్తి నుంచి వెలువడే గాలి దిశను మారుస్తాయని కూడా తెలిపారు. అందువల్ల ఎదురుగా ఉండే వ్యక్తికి రక్షణ లభిస్తుందన్నారు.
ఇవీ చూడండి: