కరోనాను నయం చేసేందుకు ప్రపంచ దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే ఈ ఔషధంతో ఉన్న ప్రమాదాలను బయటపెట్టింది ఓ అధ్యయనం. గుండె వేగంలో హెచ్చుతగ్గులు, రక్తంలో చక్కెర నిల్వల క్షీణతకు దారి తీసే అవకాశం ఉందని తేల్చింది.
వైరస్ నయమయ్యేందుకు ఉపయోగిస్తోన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ ఔషధం ద్వారా ఈ అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు కెనడాలోని సన్నీబ్రూక్ హెల్త్ సెంటర్ అధ్యయనంలో తేలింది.
"వైద్యులు, రోగులు క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ ఔషధాల వాడకం కొన్నిసార్లు ప్రాణాలు పోయేందుకు కారణం కావచ్చు."