ఆన్లైన్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలంటూ ట్రంప్ సర్కర్ చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు స్టోనీ బ్రూక్ స్కూల్ ఆఫ్ జర్నలిజం విజిటింగ్ ప్రొఫెసర్ శ్రీ శ్రీనివాసన్. జాత్యహంకార వలస విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాల ద్వారా విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలపై చర్చించారు శ్రీనివాసన్.
మేలుకొలుపు కావాలి
అమెరికాలోని భారతీయ సమాజం కూడా ట్రంప్ పట్ల భిన్నవైఖరితో ఉందని శ్రీనివాసన్ తెలిపారు. భారత సంతతి వ్యక్తులంతా కలిసి లేరని పేర్కొన్నారు. కొంతమంది ట్రంప్‌కు మద్దతిస్తుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. వలసదారులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై భారతీయులు పోరాడడాన్ని ప్రస్తావించారు. అధ్యక్షుడికి ఓటు బ్యాంకు కానప్పటికీ వీరంతా.. ట్రంప్‌ను హానికరం కాని వ్యక్తిగానే పరిగణించారని గుర్తు చేశారు. వీరందరికీ ఈ నిర్ణయం ఓ మేలుకొలుపు కావాలని అన్నారు.
"ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం చేసేది కూడా ఇదే. గందరగోళం సృష్టించడమే వారి ప్రధాన లక్షణం. జాత్యహంకారంతో పాటు ఇతర విధానాలను ఒకేసారి అమలు చేస్తున్నారు. వైద్యం, ఆర్థికం, జాతి వివక్షలో అమెరికా విఫలం కావడం మనం చూస్తున్నాం."
-శ్రీ శ్రీనివాసన్, విజిటింగ్ ప్రొఫెసర్, స్టోనీ బ్రూక్ స్కూల్ ఆఫ్ జర్నలిజం
ట్రంప్ ప్రభుత్వం వలసవాదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని దుయ్యబట్టారు శ్రీనివాసన్. ఇమ్మిగ్రేషన్ విధానాలు మెరుగ్గా ఉన్నాయి కాబట్టే ప్రజలు, విద్యార్తులు ఇక్కడి వచ్చి దేశానికి మేలు చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాకు భారతీయ ఐఐటీ నిపుణులు అవసరం లేదని ట్రంప్ భావిస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయులకే కాకుండా అమెరికాకు కూడా హాని కలిగిస్తుందని అన్నారు.
ఎన్నికల కోసమే ఇదంతా!