నలుగురు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ క్రూ-1 వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి తిరిగివస్తోంది. శనివారం సాయంత్రం అది ఐఎస్ఎస్ నుంచి బయలుదేరినట్లు స్పేస్ఎక్స్ పేర్కొంది. వ్యోమనౌకలో ముగ్గురు నాసాకు చెందిన వారు కాగా.. జపాన్‌కు చెందిన ఒకరు తిరిగి వస్తున్నారు. ఈ వ్యోమనౌక ఆరున్నర గంటలు ప్రయాణం చేసి.. ఫ్లోరిడా మెక్సికో తీరంలోని పనామా సిటీకి చేరుకోనుందని స్పేస్ఎక్స్ తెలిపింది.
ఇదీ చదవండి:అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్న నలుగురు వ్యోమగాములు