ఫాల్కన్-9 రాకెట్ ద్వారా మంగళవారం రాత్రి మరో 60 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది స్పేస్ఎక్స్. దీనిని అమెరికా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. స్టార్‌లింక్ ప్రాజెక్టు ద్వారా భూమిపై విస్తృత స్థాయిలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంధానం దీని ఉద్దేశం.
మరో 60 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్ఎక్స్ - Starlink internet satellite constellation system
అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్ఎక్స్ విజయవంతంగా మరో 60 ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. ఫాల్కన్-9 రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనావెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది.
మరో 60 ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్ఎక్స్
మొదటదశ ప్రయోగం తర్వాత భూమికి తిరిగొచ్చిన రాకెట్‌నే ఈ మిషన్‌లో కూడా ఉపయోగించినట్లు స్పేస్ఎక్స్ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. 2018 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కింద ఇప్పటివరకు ఆరు మిషన్లు పూర్తవగా... తాజాగా ఏడో ప్రయోగం జరిపింది.
ఇదీ చూడండి:అధికార బదిలీ ప్రక్రియలో మరో ముందడుగు