తెలంగాణ

telangana

ETV Bharat / international

వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు- ఐదుగురు మృతి - అమెరికా న్యూజెర్సీలో కాల్పులు

అమెరికాలోని ఓహియో, న్యూజెర్సీ ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓహియోలో బార్​ బయట ఆగంతుకుడు కాల్పులకు పాల్పడగా ముగ్గురు మరణించారు. న్యూ జెర్సీలోని ఓ ఇంట్లో పార్టీ జరుగుతుండగా కాల్పుల మోత మోగింది. ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Shooting reported in various parts of America, several dead
అమెరికాలో వేరువేరు ప్రాంతాల్లో కాల్పుల మోత

By

Published : May 23, 2021, 8:53 PM IST

అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో పలువురు మృతిచెందారు, అనేకమంది గాయపడ్డారు.

పార్టీలో..

సౌత్​ న్యూ జెర్సీలోని ఓ ఇంట్లో పార్టీ జరగగా.. అందులో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 12మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నట్టు తెలుస్తోంది.

బార్​ బయట..

ఓహియోలో యంగ్స్​టౌన్​లోని ఓ బార్​ బయట ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 2గంటలకు ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.

ఇదీ చూడండి:-బస్సుపై 70 రౌండ్ల కాల్పులు- ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details