అమెరికా కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు(california wildfire 2021) అంతకంతకూ విస్తరిస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నా వేడిగాలుల కారణంగా.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. విమానాల సాయంతో మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది.
అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా మారిన కార్చిచ్చు
కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం(california wildfire 2021) సృష్టిస్తోంది. బలమైన గాలులు, పొడివాతావరణ.. కార్చిచ్చుకు తోడవడం వల్ల మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బంది సవాల్‌గా మారింది.
కార్చిచ్చు విధ్వంసం
శాంటా బార్బరా కౌంటీకి పశ్చిమాన శాంటా యినెజ్ పర్వతాల్లో 24 చదరపు మైళ్లకుపైగా కార్చిచ్చు(california wildfire 2021) విస్తరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో పర్వతాలకు సమీపంలోని గ్రామీణా ప్రాంతాలను దావనలం చుట్టుముట్టింది. అంతకుముందే అప్రమత్తమైన అధికారులు.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలోని ఓ ప్రధాన రహదారిని మూసివేశారు.
ఇదీ చూడండి:నవంబరు 8 నుంచి విదేశీయులకు అనుమతి.. కానీ..