తెలంగాణ

telangana

ETV Bharat / international

వియత్నాం వేదికగా ట్రంప్​,కిమ్​ భేటీ - కిమ్​ జోంగ్​ ఉన్

కిమ్​ జోంగ్​ ఉన్​, డొనాల్డ్​ ట్రంప్​ల మధ్య చరిత్రాత్మకమైన రెండో భేటీ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జరగనుంది.

వియత్నాం వేదికగా ట్రంప్​ కిమ్​ భేటీ

By

Published : Feb 6, 2019, 11:40 AM IST

Updated : Feb 6, 2019, 12:13 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ల రెండో భేటీకి వియత్నాం వేదిక కానుంది. వియత్నాం రాజధాని హనోయ్​ లేదా దా నాంగ్​ నగరంలో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఇరువురి మధ్య చరిత్రాత్మక సమావేశం ఉండనుంది. ఈ సమావేశంలో అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షల ఉపసంహరణపై దౌత్యపరమైన చర్చలు జరపనున్నారు.

వాషింగ్టన్​లో జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఈ భేటీ వివరాలు ప్రకటించారు. కొరియా అధ్యక్షుడు కిమ్​తో సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ట్రంప్​, కిమ్​లు గతేడాది సింగపూర్​లో మొదటిసారిగా సమావేశమయ్యారు. ఈ చారిత్రక సమావేశంలో అణ్వాయుధాల ఉపసంహరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Last Updated : Feb 6, 2019, 12:13 PM IST

ABOUT THE AUTHOR

...view details