Russia Ukraine War: నాటో కూటమిలో భాగస్వామ్యం అయ్యే దేశాలకోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నాటోలోని ప్రతి అంగుళాన్ని రక్షించేందుకు అమెరికా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. నాటో ఎప్పుడూ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటోందని స్పష్టం చేశారు బైడెన్.
"యూరోప్ దేశాల భాగస్వామ్యం కోసం నాటో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆర్టికల్ 5 ప్రకారం.. నాటో దేశాలకు అండగా ఉండేందుకు అమెరికా బలగాలను పంపనుంది. నాటో ఎప్పుడూ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
నాటో దేశాలతో సమావేశమైన తర్వాత బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాటోతో సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు బైడెన్. ఉక్రెయిన్ ప్రజల పోరాటప్రతిమను కొనియాడారు. ఉక్రెయిన్‌కు మద్దతును కొనసాగిస్తామన్నారు.