రోబోలు చాలా రకాల పనులు చేయడం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ మానవులకు మాత్రమే సాధ్యమైన అద్భుతమైన చిత్ర కళను ప్రదర్శిస్తోంది ఓ మర మనిషి. ఈ రోబో చిత్రలేఖనం నైపుణ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
19 వ శతాబ్దం నాటి తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ అడా లవలేస్ పేరును సార్థకం చేసేలా ఈ రోబోను ఐడాగా పిలుస్తున్నారు. ఈ మర మనిషి గీసిన చిత్రాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఐడా చిత్రాలకు వచ్చిన డబ్బెంతో తెలుసా అక్షరాలా 1.27 మిలియన్ అమెరికన్ డాలర్లు... భారత కరెన్సీలో రూ. 8 కోట్లు. ఈ ప్రదర్శన జులై 6 వరకు కొనసాగనుంది.
ఐడాను కృత్రిమ మేధస్సు గల తొలి అల్ట్రా రియాలిస్టిక్ రోబోగా చెప్తున్నారు.
"ఐడా మనిషిని చూడగలదు. కళ్లల్లోని కెమెరాలతో మనిషి చిత్రాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. సాంకేతికత సహాయంతో చిత్రాన్ని విశ్లేషించుకుంటుంది. అనంతరం బొమ్మలను గీస్తుంది."