తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెజాన్​ బాస్​కు 'రిచ్'​ షాక్ - SPACE

అంతరిక్షంలోకి అడుగు పెట్టిన తొలి సంపన్నుడిగా ఘనత సాధించాలని తీవ్రంగా పోటీ పడ్డారు వ్యాపార దిగ్గజాలు ఎలాన్ మస్క, జెఫ్ బెజోస్. జులై 20 అంతరిక్ష యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించి బెజోస్ పైచేయి సాధించారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు వ్యాపారవేత్తలకు షాక్ ఇచ్చారు మరో సంపన్నుడు రిచర్డ్​ బ్రాన్సన్​ . జులై 11నే అంతరిక్షంలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు.

Richard Branson
స్పేస్ రేస్​.... అమెజాన్​ బాస్​కు 'రిచ్'​ షాక్

By

Published : Jul 2, 2021, 8:47 PM IST

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్​, టెస్లా అధినేత ఎలాన్ మస్క్..​ భూమిపై అత్యంత ధనవంతుల్లో టాప్​ ప్లేస్​లో ఉన్న దిగ్గజ వ్యాపారవేత్తలు. వీరిద్దరూ అంతరిక్షంలోనూ తమ సత్తా చాటాలని తీవ్రంగా పోటీపడ్డారు. దీని కోసం ప్రత్యేక సంస్థలను నెలకొల్పి ఎన్నో పరిశోధనలు జరిపారు. చివరకు తన సంస్థ బ్లూ ఆరిజిన్ రూపొందించిన స్పేస్ షిప్​లో జులై 20న సోదరునితో కలిసి అంతరిక్ష యాత్రకు బయలుదేరుతున్నట్లు ప్రకటించి బెజోస్​ పైచేయి సాధించారు. రోదసీలోకి అడుగు పెట్టబోతున్న తొలి సంపన్నుడు ఆయనే అవుతారని అంతా భావించారు. కానీ బెజోస్, మస్క్​లకు షాక్​ ఇస్తూ మరో సంపన్నుడు రిచర్డ్ బ్రాన్సన్​ అనూహ్యంగా రేసులోకి వచ్చారు. జులై 11న అంటే.. బెజోస్ యాత్రకు 9 రోజుల ముందే తాను అంతరిక్ష యాత్ర చేపడుతున్నట్లు రిచర్డ్ ట్వీట్ చేశారు. దీంతో రోదసీలోకి వెళ్తున్న తొలి సంపన్నుడిగా అరుదైన ఘనత ఆయన సాధించనున్నారు.

"నేను ఎప్పుడూ కలలు కనేవాడిని. అనుకున్నది సాధించే విషయంలో ఎప్పుడూ వెనక్కి తగ్గొద్దని, ఆకాశంలోని నక్షత్రాలను చేరుకోవాలని మా అమ్మ నాకు నేర్పింది. జులై 11న నా స్వప్నం సాకారం కాబోతోంది. వర్జిన్​ గెలాక్టిక్ అంతరిక్షనౌకలో నా యాత్ర మొదలు కాబోతోంది" అని రిచర్డ్ ట్వీట్ చేశారు.

"అంతరిక్షం అందరికీ చెందుతుందని నేను విశ్వసిస్తా. 17 సంవత్సరాల పరిశోధన, ఇంజనీరింగ్, ఆవిష్కరణల తర్వాత వర్జిన్ గెలాక్టిక్.. విశ్వాన్ని మానవజాతికి తెరవడానికి, ప్రపంచాన్ని మంచి కోసం మార్చడానికి సిద్ధంగా ఉన్న ఒక కొత్త వాణిజ్య అంతరిక్ష పరిశ్రమకు శ్రీకారం చుడుతున్నాం" అని రిచర్డ్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

వెబ్​సైట్​, యూట్యూబ్​లో లైవ్​..

వర్జిన్ గెలాక్టిక్ వీఎస్​ఎస్​ యూనిటీ అంతరిక్షనౌకకు ఇది 22వ విమాన పరీక్ష. తొలిసారి సంస్థ సిబ్బంది ఇందులో ఉంటున్నారు. అంతరిక్ష పర్యటకం కోసమే ఎంతో విశాలంగా దీన్ని రూపొందించారు. యుద్ధ విమానం నుంచి ఇది లాంచ్ అవుతుంది. 55 మైళ్ల ఎత్తువరకు చేరుకోగలదు. అయితే జెఫ్ బెజోస్​ సంస్థ బ్లూ ఆరిజిన్​ న్యూ షెపర్డ్​తో పోల్చితే దీని సామర్థ్యం తక్కువ. నేల నుంచి ప్రయోగించే న్యూ షెపర్డ్.. 66మైళ్ల ఎత్తు వరకు చేరుకోగలదు.

అంతర్జాతీయంగా గుర్తించిన అంతరిక్ష సరిహద్దు కర్మన్ లైన్.. 62 మైళ్ల ఎత్తులో ఉంటుంది. అందువల్ల బ్రాన్సన్ మొదటి అంతరిక్ష యాత్ర చేపట్టినప్పటికీ.. బెజోస్​కు మరో ఘనత దక్కుతుంది. అయితే 50 మైళ్ల ఎత్తులో ఉన్న నాసా అంతరిక్ష సరిహద్దును వర్జిన్ గెలాక్టిక్​ చేరుకోగలదు.

రిచర్డ్ అంతరిక్ష యాత్రను కంపెనీ అధికారిక వెబ్​సైట్​, యూట్యూబ్​లో జులై 11న ఉదయం 9 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

తెలుగమ్మాయి..

రిచర్డ్​తో పాటు స్పేస్​లో తొలిసారి ఓ తెలుగమ్మాయి విహరించబోతుంది. రిచర్డ్​తో పాటు మరో ముగ్గురు ప్రయాణించనుండగా.. వారిలో తెలుగు మూలాలు ఉన్న శిరీషకు చోటు దక్కింది.

ఇదీ చూడండి:బెజోస్‌తో అంతరిక్ష ప్రయాణానికి అన్ని కోట్లా!

ABOUT THE AUTHOR

...view details