వలసవాదులపై ట్రంప్ తీసుకున్న చర్యలను తిరిగి మార్చేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో.. త్వరితగతిన ట్రంప్ చర్యలను రూపుమాపుతానని బైడెన్ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ వ్యవహారంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే.. సరిహద్దుల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయని జో బైడెన్ పేర్కొన్నారు. ఈ విషయంపై మెక్సికో అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్న బైడెన్.. తన చర్యలు సమస్యలను పరిష్కరించే విధంగానే ఉంటాయని.. వాటిని ఇంకా దారుణంగా మార్చనని పేర్కొన్నారు.
బైడెన్ ప్రధాన సలహాదారులు... సుసాన్ రైస్, జాక్ సలివన్ కూడా వలసవాదుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావని ఇటీవలే అభిప్రాయపడ్డారు.