తెలంగాణ

telangana

ETV Bharat / international

వారంలో అందుబాటులోకి 'కరోనా' దివ్య ఔషధం! - కరోనా వైరస్ చికిత్స

కరోనా వైరస్​పై పనిచేస్తోన్న రెమ్​డెసివిర్​ ఔషధాన్ని తయారు చేసిన గిలీడ్ సైన్సెస్​ కీలక ప్రకటన చేసింది. వచ్చే వారంలోగా ప్రతి ఒక్కరికీ ఔషధాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్​ తయారీపైనా దృష్టి పెట్టామని తెలిపింది.

VIRUS-US-REMDESIVIR
దివ్య ఔషధం

By

Published : May 4, 2020, 5:12 PM IST

కరోనాపై ప్రభావం చూపిస్తోన్న రెమ్​డెసివిర్ ఔషధాన్ని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తయారీ సంస్థ గిలీడ్​ సైన్సెస్​ ప్రకటించింది. వచ్చే వారం మొదట్లోనే ప్రతి బాధితుడికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

కరోనా రోగులకు అత్యసవర సమయాల్లో ఈ ఔషధంతో చికిత్స చేసేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ విభాగం (ఎఫ్​డీఏ) ఆనుమతించింది. కరోనా రోగులు వేగంగా కోలుకునేందుకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతోందని భారతీయ–అమెరికన్ నేతృత్వంలోని వైద్యుల బృందం తేల్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఎఫ్​డీఏ.

విరాళంగా..

ఇప్పటికే సంస్థ వద్దనున్న రెమ్​డెసివిర్​ మందులన్నీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది గిలీడ్. సుమారు 2 లక్షల మందికి సరిపడే 15 లక్షల బాటిళ్లను సరఫరా చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉన్న ప్రదేశాల్లో ఈ మందును ఉపయోగకరంగా వాడాలని సూచించింది.

వ్యాక్సిన్​ కూడా..

ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికే రెమ్​డెసివిర్​ను ఉపయోగించేందుకు అనుమతి ఉంది. ఎందుకంటే ఈ ఔషధం పనితనంపై క్లినికల్​ ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.

కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారీ చేస్తున్నట్లు గిలీడ్ సీఈఓ డాన్​ ఓడే తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పష్టం చేశారు. వ్యాక్సిన్​ తయారీ విషయంలో ప్రభుత్వ సంస్థలతో కలిసి గిలీడ్ కృషి చేస్తోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details