తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా దుర్నీతికి అదో ఉదాహరణ: పాంపియో

భారత్​కు చెందిన తూర్పు లద్దాఖ్​ గల్వాన్ లోయను ఆక్రమించేందుకు చైనా చేసిన దాడిపై అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో తీవ్రంగా స్పందించారు. టిక్​టాక్ సహా 59 చైనా యాప్​లను భారత్​ నిషేధించడాన్ని ఆయన ప్రశంసించారు

Recent clashes initiated by PLA latest examples of 'unacceptable behaviour' of CCP: Pompeo
చైనా దుష్ట ప్రవర్తనకు అదో ఉదాహరణ: పాంపియో

By

Published : Jul 22, 2020, 9:54 PM IST

తూర్పు లద్దాఖ్​లో భారత సైనికులపై డ్రాగన్​ బలగాలు చేసిన దాడిని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా దుర్నీతికి నిదర్శనంగా అభివర్ణించారు అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో. 'ఇండియా ఐడియా సమ్మిట్'​లో మాట్లాడుతూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్​ నిర్ణయం భేష్​

59 చైనా యాప్​లను భారత్​ నిషేధించడాన్ని పాంపియో స్వాగతించారు. పౌరుల భద్రతకు సవాల్​గా నిలుస్తున్న అలాంటి యాప్​లను భారత్​ నిషేధించడం చాలా మంచి విషయమన్నారు.

కలిసి పనిచేద్దాం..

ప్రపంచానికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా సవాల్​ విసురుతున్న నేపథ్యంలో... భారత్​-అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పాంపియో అభిప్రాయపడ్డారు. ట్రంప్ విదేశాంగ విధానంలో భారత్​కు ప్రత్యేక స్థానముందని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా... అమెరికా రక్షణ, భద్రతా భాగస్వామిగా భారత్​ నిలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పాంపియో అన్నారు.

గల్వాన్ ఘర్షణ

తూర్పు లద్దాఖ్ గల్వాన్​ లోయ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు చైనా బలగాలు జరిపిన దాడిలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. అయితే ఈ ఘర్షణలో చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. చైనా విస్తరణ వాదాన్ని తప్పుపట్టిన అమెరికా... భారత్​కు మద్దతు ప్రకటించింది.

ఇదీ చూడండి:'ఆ శక్తి భారత్​- అమెరికాకు మాత్రమే ఉంది'

ABOUT THE AUTHOR

...view details