అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ వాషింగ్టన్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నగరంలోని బీఎల్ఎం ప్లాజా వద్ద ఫలితాల కోసం కొందరు ఆందోళన చేపట్టగా ఈ ఘటన జరిగింది.
వందల మంది నిరసనకారులు నినాదాలు, నృత్యాలు చేస్తూ ఓట్ల లెక్కింపు కోసం డిమాండ్ చేశారు. "ట్రంప్‌ను తొలగించాలి", "ట్రంప్ ఎప్పుడూ అబద్దాలే చెబుతారు" అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు.