కరోనా మహమ్మారి బారిన పడుతున్న ప్రపంచ నేతల జాబితాలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి అగ్రరాజ్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ చేరారు. ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని ప్రపంచ దేశాల నేతలు ఆకాంక్షిస్తున్నారు.
భారత రాష్ట్రపతి...
కొవిడ్-19 బారినపడిన అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణి వైరస్ను జయించాలని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్షించారు.
మోదీ...
కరోనా బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ట్రంప్ దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశారు.