ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా కొనసాగుతోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పర్వం తుది దశకు చేరింది. దేశవ్యాప్తంగా మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సారథ్యాన్ని అగ్రరాజ్యం కొనసాగిస్తుందా? లేదా డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ చేతికి అప్పగిస్తుందా? అనేది అతి త్వరలో తేలనుంది.
ఓటింగ్ ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి 7 గంటలకు(భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 4.30), మిగతా చోట్ల రాత్రి 9 గంటలకు(భారత్‌లో బుధవారం ఉదయం 6.30) పూర్తవుతుంది.
రికార్డు స్థాయి ఓటింగ్!
కరోనా నేపథ్యంలో ముందస్తు ఓటింగ్‌కు అపూర్వ ఆదరణ లభించింది. ఇప్పటికే రికార్డు స్థాయిలో 10 కోట్ల మంది ఓటేశారు. బ్యాలెట్ విధానంలో సుమారు 6 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా. అంటే మొత్తం 67 శాతం పోలింగ్. 1900 ఏడాది తర్వాత ఇదే అత్యధికం కానుంది.
లెక్కింపు ఇలా..
ఓటింగ్ పూర్తి కాగానే లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. అమెరికా ఎన్నికల ప్రక్రియ ఎంత సంక్లిష్టమో.. లెక్కింపు కూడా అంతే కష్టమైన పని. ఇందుకు సహజంగా చాలా రోజుల సమయం పడుతుంది. అయితే, ఎన్నికలు జరిగిన తర్వాతి రోజే విజేత ఎవరనేది ఓ స్పష్టత వస్తుంది.
ఫలితాలు ఎప్పుడు?
ఫలితాలు రాత్రి వరకు తేలుతాయా? ఆలస్యం జరుగుతుందా? అనే సందేహాలు అందరి మదిలో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో మెయిల్ ఓటింగ్ భారీగా పెరగటం వల్ల లెక్కింపు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపులో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిబంధనలు అమల్లో ఉండటమూ జాప్యానికి అవకాశం ఇస్తోంది.
ఎన్నిక పరోక్షమే..
అమెరికా అధ్యక్షుడు ప్రజల ఓట్లతో నేరుగా కాకుండా పరోక్ష పద్ధతిలోనే ఎన్నికవుతారు. ఈ సంక్లిష్ట ప్రక్రియలో ఎలక్టోరల్ కాలేజ్‌లో అత్యధిక స్థానాలు సాధించిన వారే విజేత. ప్రజలు వాస్తవంగా ఓటు వేసేది ఎలక్టార్‌కు. ప్రతి రాష్ట్రానికి జనాభాను అనుసరించి ఎలక్టార్ల సంఖ్యను నిర్ణయిస్తారు. మొత్తం 538 మంది ఎలక్టార్లు ఉంటారు. 270 అంతకన్నా ఎక్కువ మంది ఎలక్టార్లను గెల్చుకున్న పార్టీ అభ్యర్థే అధ్యక్షుడవుతారు.
ఎప్పుడూ ఈ పార్టీలేనా?
అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వినిపించే పార్టీల పేర్లు.. డెమొక్రటిక్, రిపబ్లికన్. ఈ రెండు పార్టీలదే అమెరికా రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో రెండే ప్రధాన పార్టీలుగా ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయి.
ఓటరు ఎటువైపు?