తెలంగాణ

telangana

ETV Bharat / international

15మందిని బలిగొన్న విద్యుత్​ కోత - వెనిజువెలా

వెనిజువెలా విద్యుత్​ సమస్యతో సతమతమవుతోంది. కరెంటు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. డయాలసిస్​ సరిగ్గా జరగక ఆసుపత్రుల్లో 15 మంది రోగులు మృతిచెందారు.

వెనిజువెలాలో తీవ్ర విద్యుత్​ సంక్షోభం

By

Published : Mar 10, 2019, 9:27 AM IST

వెనిజువెలాలో విద్యుత్​ సంక్షోభం తీవ్రమైంది. ఆసుపత్రులకు విద్యుత్​ సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్​ జరగక రెండు రోజుల వ్యవధిలోనే15 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా విద్యుత్​ కార్మికులు సమ్మెకు దిగారు. రాజధాని కరాకస్​ సహా పలు ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. ఇప్పటికే రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వెనిజువెలాను విద్యుత్​ కష్టాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.

దేశవ్యాప్తంగా మరో 10 వేల 200 మంది రోగులు డయాలసిస్​పై ఆధారపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది ప్రభుత్వం.

అమెరికా చర్యల కారణంగానే విద్యుత్​ సమస్య అనిదేశాధ్యక్షుడు నికోలస్​ మధురో ఆరోపించారు. వేగంగా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ, సైబర్​ దాడుల కారణంగా ఈ చర్యలు ఫలించట్లేదని తెలిపారు. ప్రతిపక్ష నేత గ్వైడోదేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.

వెనిజువెలాలో తీవ్ర విద్యుత్​ సంక్షోభం

ABOUT THE AUTHOR

...view details