తెలంగాణ

telangana

ETV Bharat / international

లక్షల విలువైన విస్కీ బాటిల్​- ఎవరు కొట్టేశారు? - డొనాల్డ్​ ట్రంప్ మైక్​ పాంపియో

రూ.4.30 లక్షల విలువైన విస్కీ బాటిల్​ దాదాపుగా రెండేళ్ల తర్వాత కనిపించడం లేదంటూ అమెరికా ట్రెజరీ విభాగం అధికారులు ఆందోళన చెందుతున్నారు. 2019లో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్​ పాంపియోకు జపాన్​ ప్రభుత్వం బహూకరించిన ఆ బాటిల్​ ఇప్పుడు లెక్కల్లో లేదని తెలుస్తోంది. దీనిపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Pompeo got $5,800 whisky gift from Japan, but where is it?
రూ.4.30 లక్షల విలువైన విస్కీ బాటిల్​ పోయింది!

By

Published : Aug 5, 2021, 5:34 PM IST

2019లో జపాన్​ ప్రభుత్వం అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియోకు బహుమతిగా ఇచ్చిన విస్కీ బాటిల్​ ఇప్పుడు కనిపించడం లేదట. దాదాపు రూ.4.30 లక్షల విలువ కలిగిన ఆ మందు బాటిల్​ అధికారిక లెక్కల్లో కనిపించకుండా పోయిందని అధికారులు రెండేళ్ల తర్వాత ఆందోళన చెందుతున్నారు.

ఫెడరల్​​ రిజిస్టర్​ దాఖలు చేసిన నోటీస్​ ప్రకారం.. ఆ విస్కీ బాటిల్​ ఆచూకీని సంబంధిత అధికారులు కనుగొనలేకపోయారు. అయితే ఇప్పుడా బాటిల్​ ఏమైందనే దానిపై విచారణ జరుగుతుంది. విదేశాలు, వారి నాయకులు.. అమెరికా అధికారులకు ఇచ్చే బహుమతుల వివరాలను డిపార్ట్​మెంట్​ వార్షిక గణాంకాల కోసం తనిఖీ చేస్తారు. ఈ నేపథ్యంలో విస్కీ బాటిల్​ మిస్​ అయ్యిందని తెలిసింది.

ఏం జరిగిందంటే?

అమెరికాలోని డిపార్ట్​మెంట్​ ఆఫీస్​ ఆఫ్​ ప్రోటోకాల్​ ప్రకారం.. అధికారులకు విదేశాంగ ప్రతినిధులు ఇచ్చే ప్రతి బహుమతి వివరాలను లెక్కించడం ఆనవాయితీ. అలా ప్రతి బహుమతికి సంబంధించిన నిర్దిష్ట విలువను లెక్కించి.. వాటిని ట్రెజరీ డిపార్ట్​మెంట్​కు అందిస్తుంది. అయితే వాటిని రీయింబర్స్​మెంట్​ ద్వారా ట్రెజరీ దగ్గర కొనుగోలు చేసి వినియోగించుకునే అవకాశం అధికారులకు ఉంది.

అయితే ఇప్పుడు కనిపించకుండా పోయిన జపనీస్​ విస్కీ బాటిల్​ దాదాపుగా రూ.4.30 లక్షల విలువ కలిగిందట. 2019 జూన్​లో జరిగిన గ్రూప్​ ఆఫ్​ 20 సమ్మిట్​లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో పాటు ఆ సమావేశానికి మైక్​ పాంపియో కూడా హాజరయ్యారు. అయితే ఆయనకు వచ్చిన ఇతర బహుమతులు కాకుండా.. విస్కీ బాటిల్​కు సంబంధించిన ఎలాంటి వివరాలు లేవని సంబంధిత అధికారులు వెల్లడించారు.

"విస్కీ బాటిల్​ కనిపించకుండా పోయిన విషయాన్ని డిపార్ట్​మెంట్​ పరిశీలిస్తుంది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంద"ని ఫెడరల్​ రిజిస్టర్​ నోటీసులో పేర్కొంది. అయితే ఇందులో ఇతర వివరాలను చెప్పలేదు.

బహుమతుల వివరాలు

అదే విధంగా యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ విదేశాంగ శాఖ మంత్రి, కజకిస్థాన్​ అధ్యక్షుడి నుంచి మైక్​ పాంపియో రూ.14.39 లక్షల విలువైన రెండు కార్పెట్స్​ బహుమానంగా పొందినట్లు తెలిసింది. వాటిని జనరల్​ సర్వీస్​ అడ్మినిస్ట్రేషన్​కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఆయన భార్య మెలానియా.. విదేశాంగ ప్రతినిధుల నుంచి రూ.89.03 లక్షల విలువైన బహుమతులను అందుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ట్రంప్​ తొలిసారి అధ్యక్షుడైన తర్వాత 2017లో అత్యధికంగా రూ.1.03 కోట్ల విలువైన బహుమతులను స్వీకరించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి..ట్రంప్ దారిలో​నే బైడెన్​- చైనాకు వార్నింగ్!

ABOUT THE AUTHOR

...view details