అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని సైరక్యూస్ నగరంలో శనివారం రాత్రి జరిగిన ఓ వేడుక ప్రాంగణం కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ 17ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మిగిలిన వారి వయస్సు 18-53 మధ్య ఉంటుంది. అయితే వీరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆ వేడుకలో..
కారు దొంగిలిచ్చారనే ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడికి చేరుకున్న అనంతరం ఓ పార్కింగ్ ప్రాంగణంలో వందల సంఖ్యలో ప్రజలను గుర్తించారు. వేడుకలో కాల్పులు శబ్దం వినిపించిందని పలువురు పోలీసులకు వెల్లడించారు.