జీ20 సదస్సు వేదికగా మోదీ- ట్రంప్ భేటీ ఈ నెల 28,29 తేదీల్లో జపాన్‌లోని ఒసాకా నగరంలో జరగనున్న జీ20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమవనున్నారు. ట్రంప్‌తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్, జపాన్ ప్రధాని షింజో అబే సహా దాదాపు 10 మంది దేశాధ్యక్షులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోదీ.
రష్యా-భారత్-చైనా(ఆర్ఐసీ), జపాన్-అమెరికా-భారత్(జేఏఐ) త్రైపాక్షిక చర్చలతో పాటు బ్రిక్స్ దేశాధినేతలతో సమావేశం కానున్నారు మోదీ.
తొలిసారిగా..
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి భారతదేశ ప్రధానిగారెండోసారి పదవి చేపట్టిన అనంతరం ట్రంప్‌తో మోదీ తొలిసారి భేటీకానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహత్మక ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి.
వీటిపైనే చర్చలు
ఈ సారి జీ20 సదస్సులో ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు, నవకల్పనలు, డిజిటల్ ఎకానమి, కృత్రిమ మేధ, వాతావరణ మార్పులు, పర్యావరణ సంరక్షణ వంటి అంశాలపై దేశాధినేతలు చర్చించనున్నారు.
ఇదీ చూడండి: 'గాంధీలు కాని ప్రధానులపై కాంగ్రెస్ చిన్నచూపు'