ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆ ప్రమాదంలో అసువులు బాసారని స్థానిక టీవీ ఛానెల్ ప్రసారం చేసింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నది అధికారులు వెల్లడించలేదు.
పెరూలో బస్సు ప్రమాదం.. 20 మంది మృతి - బస్సు ప్రమాదం
పెరూ రాజధాని నగరం లిమాలో ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి గాయాలయ్యాయి. బస్సులో సాంకేతిక లోపం తలెత్తడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
పెరూలో బస్సు ప్రమాదం-20మంది మృతి
ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు లిమా నగర మేయర్ జార్జ్ మునోజ్. క్షతగాత్రులను పరామర్శించారు.
Last Updated : Apr 1, 2019, 5:44 PM IST