లక్షలాది మంది ప్రజలతో కరీబియన్ దేశం హైతీలోని శ్మశానాలు కిక్కిరిశాయి. 'ఫెస్టివల్ ఆఫ్ డెడ్' ఉత్సవాల్లో ఆ దేశ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఆ వేడుకలు సాధారణంగా ప్రతి ఏటా నవంబర్ మొదటి వారంలో జరుగుతాయి. మంచి భవిష్యత్తు, ఉద్యోగం, ఆరోగ్యం కోసం సమాధులను ప్రార్థిస్తారు హైతీవాసులు.
అనేక మంది.. సమాధులపై మద్యం పోసి కొవ్వొత్తులు వెలిగించి సమాధులకు ప్రత్యేక పూజలు చేశారు. దీనిని 'ఊడూ' సంప్రదాయమంటారు. కొందరు భక్తితో మైమరిచిపోయి నృత్యాలు చేశారు. మరికొందరు సమాధుల ముందు నిశ్శబ్దంగా నిల్చొని.. తమకు సహాయం చేయాలని ఆత్మలను వేడుకున్నారు.