దిల్లీ రైతులు చేస్తోన్న ఆందోళనలపై పలువురు విదేశీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల భారత్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వేళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ దీనికి మద్దతుగా స్పందించారు. రైతులకు శాంతియుతంగా ప్రదర్శన చేసుకునే హక్కు ఉందని గుటెరస్ అన్నారు. ప్రదర్శన చేపట్టేందుకు అధికారులు.. రైతులను అనుమతించాలని సూచించారు.
'నిరసన చేపట్టే హక్కు రైతులకు ఉంది' - ఆంటోనియో గుటెరస్
శాంతియుతంగా నిరసన చేపట్టే హక్కు భారత్లోని రైతులకు ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. నిరసన ప్రదర్శన చేపట్టేందుకు రైతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే కెనడా ప్రధాని రైతులకు మద్దతు తెలిపారు.
'నిరసన చేపట్టే హక్కు రైతులకు ఉంది'
రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే కెనడా ప్రధాని జస్టిన్ టుడో వ్యాఖ్యలు చేయగా.. అందుకు భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి అవగాహనe లోపంతో చేసిన వ్యాఖ్యలు అని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయండం ఓ ప్రజాస్వామ్య దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అని స్పష్టం చేసింది. భారత్‌లో కెనడా రాయబారిని పిలిపించి కూడా విదేశాంగ శాఖ నిరసన వ్యక్తం చేసింది.