తెలంగాణ

telangana

ETV Bharat / international

నాసా అభ్యంతరం- పెంటగాన్​ సమర్థన - PENTAGON

అంతరిక్షంలో ఇతర దేశాల నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలోనే... ఏశాట్​ పరీక్ష చేపట్టిందని సమర్థించింది అమెరికా రక్షణ విభాగం పెంటగాన్​. అయితే... వెలువడిన వ్యర్థాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది నాసా.

ఏశాట్​ ప్రయోగాన్ని సమర్థించిన అమెరికా

By

Published : Apr 12, 2019, 11:02 AM IST

Updated : Apr 12, 2019, 1:47 PM IST

భారత మిషన్​శక్తిపై పెంటగాన్​ సమర్థన

స్వదేశీ పరిజ్ఞానంతో భారత్​ నిర్వహించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి(యాంటీ శాటిలైట్​- ఏ శాట్​) ప్రయోగాన్ని అమెరికా సమర్థించింది. అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకే భారత్​ ఈ ప్రయోగం చేసుంటుందని సమర్థించింది అమెరికా రక్షణ విభాగం పెంటగాన్​.

''భారత్​ ఏశాట్​ ప్రయోగం ఎందుకు చేసిందనేది మొదటి ప్రశ్న. అందుకు సమాధానంగా సెనేట్ కమిటీకి చెప్పేదొక్కటే.. అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్ల నుంచి రక్షణకే... భారత్​ ఈ ప్రయోగం చేసిందని భావిస్తున్నా.''

- అమెరికా వ్యూహాత్మక విభాగ కమాండర్​ జనరల్​ జాన్

సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం తమకుందని నిరూపించేందుకు భారత్​ ఏశాట్​ ప్రయోగం నిర్వహించినట్టు సెనేట్​ సాయుధ సేవల కమిటీ ప్రశ్నకు బదులిచ్చారు జాన్​. ఈ కమిటీ భారత్​ ఉపగ్రహ విధ్వంసక క్షిపణి పరీక్ష చేపట్టటం, అంతరిక్షంలో వ్యర్థాలను ఏర్పరచటంపై వివరణ కోరింది.

భారత ప్రయోగంతో ఉత్పన్నమైన వ్యర్థాల్లో.. 60 శకలాల్ని ట్రాక్​ చేశామని.. మరో 24 ఐస్​ఎస్​ఎస్​ దూరంగా వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు నాసా అధికారి​ జిమ్​ బ్రిడెన్​స్టైన్​ తెలిపారు. వీటి నుంచే ఐఎస్​ఎస్​కు ముప్పు ఉండొచ్చని హెచ్చరించారు.

నాసా ఆందోళన....

మిషన్​ శక్తి అనంతరం వెలువడిన వ్యర్థాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) గతంలోనూ ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 400 శకలాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్​ఎస్​) ప్రమాదమని.. భారత ప్రయోగాన్ని తప్పుబట్టింది. అయితే.. ఈ వ్యర్థాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎలాంటి హాని ఉండదని.. కొద్ది రోజుల్లోనే శకలాలు విచ్ఛిన్నమవుతాయని స్పష్టం చేశారు డీఆర్​డీవో ఛైర్మన్​.

Last Updated : Apr 12, 2019, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details