తెలంగాణ

telangana

ETV Bharat / international

కాల్పుల కలకలం: గే ర్యాలీలో తొక్కిసలాట - pride parade

అమెరికా రాజధాని వాషింగ్టన్​ డీసీలో ప్రైడ్​ పరేడ్​లో అలజడి రేగింది. ఏదో పేలుడు శబ్దం విన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి.

పరేడ్​లో తొక్కిసలాట

By

Published : Jun 9, 2019, 10:33 AM IST

Updated : Jun 9, 2019, 11:43 AM IST

ర్యాలీలో తొక్కిసలాట

అమెరికాలో మరోసారి తుపాకీ కలకలం రేగింది. వాషింగ్టన్​ డీసీలో స్వలింగ సంపర్కుల ప్రైడ్​ పరేడ్​లో పేలుడు శబ్దం విని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

పరేడ్​లో ఎవరూ తుపాకీని పేల్చలేదని స్పష్టం చేశారు మెట్రోపాలిటన్​ కమాండర్​ గ్విల్లెర్మో రివేరా. అయితే తుపాకీ వెంట తెచ్చుకున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

"ప్రజలు భయంతో పరుగెత్తారు. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతున్నాడని అరిచారు. ఓ వ్యక్తి తుపాకీతో వచ్చినట్టు గుర్తించాం. అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. తను తుపాకీ పేల్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఆయుధం కలిగి ఉన్నాడనే కారణంతో అరెస్టు చేశాం."

-గ్విల్లేర్మో రివేరా, మెట్రోపాలిటన్​ కమాండర్

ఇదీ చూడండి: అల్బేనియాలో ఉద్ధృతంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

Last Updated : Jun 9, 2019, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details