అది కెనడాలోని మాంట్రియల్ ప్రాంతం. సెయింట్ జోసేఫ్ చర్చిలో ప్రార్థనల కోసంచాలామంది వచ్చారు. క్యాథలిక్ మత బోధకుడు సందేశం వినిపిస్తున్నారు. ఇంతలో ఎరుపురంగు జాకెట్, తెలుపు రంగు టోపీధరించిన ఓ వ్యక్తి మత బోధకుడు ప్రసంగిస్తున్న వేదికవైపు వచ్చాడు. ఏదో జరుగుతుందని ఊహించిన మత బోధకుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అగంతుకుడు ఆయనపై దాడి చేశాడు. ఏం జరుగుతుందో తెలియక ప్రార్థనలకు వచ్చిన వారందరూభయపడ్డారు. కొంతమంది వేదికపైకి వచ్చి ఆగంతుకుడిని అడ్డుకున్నారు.
అందరూ చూస్తుండగానే మత బోధకుడిపై దాడి - attack
కెనడాలో ఓ చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుండగా అకస్మాతుగా వచ్చిన ఓ వ్యక్తి మత బోధకుడిపై దాడి చేశాడు.
చర్చి
మత బోధుకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని కాపలాదారులు అదుపులోకి తీసుకున్నారు.