తెలంగాణ

telangana

ETV Bharat / international

పడవలో చెలరేగిన మంటలు... 33 మంది గల్లంతు! - america

అమెరికా కాలిఫోర్నియా తీరంలో ఓ వాణిజ్య పడవ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో 33 మంది గల్లంతయ్యారని అమెరికా తీర రక్షక దళం తెలిపింది.

పడవ

By

Published : Sep 2, 2019, 11:14 PM IST

Updated : Sep 29, 2019, 5:41 AM IST

అమెరికా కాలిఫోర్నియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ తీరంలోని శాంటాక్రూజ్​ దీవిలో ఓ ప్రయాణికుల పడవకు నిప్పుంటుకుంది. ఈ ఘటనలో 33 మంది గల్లంతయ్యారని అమెరికా తీర రక్షక దళం వెల్లడించింది.

తీరానికి 20 మీటర్ల దూరంలో స్కూబా డైవ్​ చేసే వాణిజ్య పడవలో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన కోస్ట్​ గార్డులు ఐదుగురిని మాత్రమే రక్షించగలిగారు. మిగితా 33 మంది ఆచూకీ తెలియలేదని తెలిపారు. పడవలో ఎంత మంది ఉన్నారనే అంశంపై స్పష్టత లేదన్నారు.

ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

Last Updated : Sep 29, 2019, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details