అమెరికాలోని డాలస్లో ఓ ప్రైవేటు విమానం కూలి 10 మంది మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రాంతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అనంతరం సమీపంలో ఉన్న హాంగర్(విమానాలు నిలుపు స్థలం)లోని ఈ విమానం దూసుకెళ్లిందని ఫెడరల్ ఏవియేషన్(ఎఫ్ఏఏ) అధికారులు వెల్లడించారు.
ప్రమాదం కారణంగా ఘటన స్థలంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను గుర్తించి వారికి సమాచారం అందించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్నవారందరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.