భారత ప్రధానమంత్రిగా రెండోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టడంపై అమెరికాలోని ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 93.9 శాతం ఎన్ఆర్ఐలు నరేంద్రుడికే మద్దతు పలికినట్టు అమెరికా ఆధారిత స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్(ఎఫ్ఐఐడీఎస్) సర్వే వెల్లడించింది.
విదేశాంగ శాఖపై ఎన్ఆర్ఐలు ప్రశంసల వర్షం కురిపించారు. వీసాలు, పాస్‌పోర్టుల జారీకి పట్టే సమయం ఎంతో తగ్గిందని హర్షం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించడానికి విదేశాంగ శాఖ చేపట్టిన చర్యలతో 95.5శాతం మంది సంతృప్తి చెందినట్టు సర్వే తెలిపింది.
సర్వేలోని మరిన్ని అంశాలు...
- మోదీ ప్రభుత్వం రోడ్లు, రవాణ, విద్యుత్ విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిందని 93 శాతం మంది నమ్ముతున్నారు.
- ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయని 80శాతం ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు.
- ప్రభుత్వ పథకాల్లో స్వచ్ఛ భారత్‌కు (86.9 శాతం) అత్యధిక మద్దతు లభించింది. మేక్ ఇన్ ఇండియా(84.6శాతం), డిజిటల్ ఇండియా(84.3 శాతం) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
- మోదీ పాలనలో దేశ భద్రత బలపడిందని 90.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.
- ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వ వైఖరికి 92 శాతం ఎన్ఆర్ఐల మద్దతు లభించింది.
- 63.3 శాతం మంది 2019 సార్వత్రిక ఎన్నికల్లో రామ జన్మభూమి, శబరిమల అంశాలు కీలకంగా మారతాయని భావించారు.
- నోట్లరద్దు, జీఎస్టీలు భారత దేశానికి దీర్ఘకాలంలో ఉపయోగపడతాయని 81 శాతం ఎన్ఆర్ఐలు విశ్వసించారు.
- అభివృద్ధి మార్గంలో భారత్ పరుగులు పెడుతోందని 90.3శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి- ఆ గోడపైనే నా డ్రీమ్ గర్ల్ ఉండేది: ఆర్జీవీ