తెలంగాణ

telangana

ETV Bharat / international

చేయని నేరానికి 24ఏళ్లు జైలులోనే.. చివరకు.. - అమెరికా న్యూస్ టుడే

అమెరికా నార్త్​​ కరోలినాలో(north carolina news) ఓ వ్యక్తి.. చేయని నేరానికి 24 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. అతడికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించారు(dontae sharpe pardon). 7.5లక్షల డాలర్ల(రూ.5.5కోట్లు) పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

North Carolina man wrongfully imprisoned 24 years pardoned
చేయని నేరానికి 24 ఏళ్లు జైలులోనే.. చివరకు క్షమాభిక్ష

By

Published : Nov 13, 2021, 6:22 PM IST

ఏ తప్పు చేయనివారు ధైర్యంగా పోరాడితే న్యాయం వారివైపే నిలుస్తుందని నిరూపించాడు అమెరికా నార్త్​ కరోలినాకు చెందిన డాన్టే షార్పె(north carolina news). ఓ హత్య కేసులో అతడు నేరం చేయనప్పటికీ 24 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. అతడికి జరిగిన అన్యాయాన్ని గుర్తించిన గవర్నర్ రాయ్​ కూపర్​​ తాజాగా క్షమాభిక్ష ప్రసాదింకోసం చారు. షార్పెకు 7.5లక్షల డాలర్లు(రూ.5.5కోట్లు) పరిహారం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఈమేరకు ఆయన శనివారం అధికారిక ప్రకటన చేశారు(dontae sharpe pardon).

1995లో జార్జ్ ర్యాడ్​క్లిఫ్​ హత్య కేసులో షార్పెకు(dontae sharpe story) యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. అప్పుడు అతని వయసు 19 ఏళ్లు. అయితే తాను నేరానికి పాల్పడినట్లు అతడు ఏనాడూ అంగీకరించలేదు. హత్య చేసినట్లు ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తామని ఆఫర్ ఇచ్చినా ససేమిరా అన్నాడు. ఎప్పటికైనా న్యాయం తనవైపు నిలుస్తుందనే ఆశతో జైలు శిక్ష అనుభవించాడు.

ఈ హత్యకు సంబంధించి ఓ 15 ఏళ్ల బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు షార్పెను అరెస్టు చేశారు(dontae sharpe north carolina). కోర్టు కూడా ఆ బాలిక చెప్పిన మాటలను సాక్ష్యంగా తీసుకునే అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసు విచారణ మళ్లీ చేపట్టాలని షార్పె ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. అయితే ఓ మాజీ వైద్య నిపుణుడు బాలిక వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత.. ఆమె చెప్పిన దానికి హత్య జరిగిన తీరుకు పొంతన లేదని, కాల్పులు అలా జరగడం అసాధ్యమని తేల్చారు. దీంతో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించాలని కోర్టు అధికారులకు సూచించింది. 2019లో షార్పెను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో అతడికి 24 ఏళ్ల తర్వాత కారాగారం నుంచి విముక్తి లభించింది.

బాలిక తప్పుడు వాంగ్మూలం..

అయితే దార్యాప్తు అధికారులు చెప్పిన వివరాల ఆధారంగానే తాను వాంగ్మూలం ఇచ్చినట్లు బాలిక తరువాత తెలిపింది. అసలు షూటింగ్ జరిగిన సమయంలో తాను అక్కడ లేనని, ర్యాడ్​క్లిఫ్ హత్యను చూడలేదని వెల్లడించింది.

జైలు నుంచి విడుదలైన షార్పెకు(North Carolina Dontae Sharpe) అన్యాయం జరిగిందని తెలిశాక న్యాయ సంఘాలు నిరసన బాట పట్టాయి. అతనికి క్షమాభిక్ష ప్రసాదించి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. గవర్నర్ కూపర్ నివాసం ఎదుట దీక్షలు చేశాయి. దీంతో షార్పె కేసు పూర్వాపరాలను పరిశీలించిన ఆయన.. క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ప్రకటించారు(dontae sharpe pardon).

అసలు నమ్మలేదు..

దీనిపై స్పందించిన షార్పె ఉద్వేగానికి లోనయ్యాడు(dontae sharpe north carolina). తన లాయర్ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తే నమ్మలేకపోయినట్లు వివరించాడు. తాను ఇంకా ఏదో ఊహాల్లో తేలుతున్నట్లు ఉందని పేర్కొన్నాడు. కూపర్​కు ధన్యవాదాలు తెలిపాడు. తన కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకుంటానన్నాడు. అయితే న్యాయ వ్యవస్థ అవినీతిమయమైందని షార్పె ఆవేదన వ్యక్తం చేశాడు. తనలా తప్పు చేయని వాళ్లు ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారని, అలాంటి వాళ్లు ఉన్నంత కాలం తనకు లభించిన స్వేచ్ఛ అసంపూర్ణమనే భావిస్తున్నట్లు తెలిపాడు.

ఇదీ చదవండి:మహిళా ఖైదీని బట్టలు విప్పించి డ్యాన్స్ చేయించిన లేడీ పోలీస్​

ABOUT THE AUTHOR

...view details