బ్లడ్ గ్రూప్‌ను బట్టి కరోనా తీవ్రతేమీ మారదని మసాచుసెట్స్ పరిశోధనలో తేలింది. బ్రడ్ గ్రూప్‌నకు కొవిడ్ తీవ్రతకు సంబంధం లేదని స్పష్టం చేసింది. కొన్ని రక్త గ్రూపులకు కరోనాకు సంబంధం ఉందని ఇదివరకు వెలువడిన పరిశోధనలకు సరైన ఆధారం లభించలేదని వెల్లడించింది.
"నిర్దిష్టంగా ఏబీఓ బ్లడ్ గ్రూప్ ఉండటం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవు."
-పరిశోధన
'ఏ' గ్రూప్ రక్తం ఉన్నవారిలో వైరస్ తీవ్రత, మరణ ముప్పు అధికంగా ఉంటుందని ఇదివరకు కొంతమంది పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు దీనిపై అధ్యయనం చేసిన మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్... ఓ భారీ డేటాబేస్‌ను తయారు చేసింది. లక్షణాలు ఉండి కరోనా పాజిటివ్‌గా తేలిన 1,289 మంది యుక్తవయసు రోగులను పరీక్షించింది. వారి బ్లడ్ గ్రూప్‌లు సేకరించింది. ఇందులో.. కరోనా రోగుల మరణానికి రక్త రకం ప్రభావం స్వతంత్రంగానే ఉందని తేలింది.