తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వైరస్​లో కొత్త జన్యువు- గుర్తించిన శాస్త్రవేత్తలు

కొవిడ్​ వైరస్​లో మరో కొత్త జన్యువును గుర్తించారు అమెరికన్​ శాస్త్రవేత్తలు. ఇది కరోనాను మరింత అర్థం చేసుకోవడానికి, మెరుగైన చికిత్సా విధానాలు రూపొందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

Slug 'New 'hidden' gene in coronavirus identified'
కరోనా వైరస్​లో మరో కొత్త జన్యువు- గుర్తించిన శాస్త్రవేత్తలు

By

Published : Nov 12, 2020, 6:16 AM IST

కరోనా వైరస్​లో ఇప్పటివరకు బయటపడని ఓ కొత్త జన్యువును శాస్త్రవేత్తలు కనిపెట్టారు. పేరు ఓఆర్​ఎఫ్​3డి. ఈ కొత్త ఆవిష్కరణ కరోనా వైరస్​ను మరింత అర్థం చేసుకోవడానికి, మెరుగైన చికిత్సా విధానాలు రూపొందించడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

''ఇదో ఓవర్​ల్యాపింగ్​ జన్యువు. అంటే ఒక జన్యువుపై ఇంకో జన్యువు పరచుకొని ఉన్నట్లు ఉంటుంది. ఇలాంటి జన్యువులను గుర్తించడం కష్టం. అత్యాధునిక కంప్యూటర్లు కూడా కనిపెట్టలేవు. ఈ జన్యువులు రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తున్నాయి. ఇలాంటి జన్యువులు ఉన్నాయని తెలుసుకోవడం చాలా కీలకం. మహమ్మారిని ఎదుర్కోవడానికి వైరస్​ను అర్థం చేసుకోవడానికి ఈ కొత్త జన్యువుల పరిశోధన చాలా ఉపకరిస్తుంది.'' అని ఈ పరిశోధనలో పాల్గొన్న అమెరికన్​ మ్యూజియం ఆఫ్​ నేచురల్​ హిస్టరీకి చెందిన నెల్సన్​ తెలిపారు. వీరి అధ్యయనాన్ని ఈలైఫ్​ జర్నల్​ ప్రచురించింది.

ABOUT THE AUTHOR

...view details