తెలంగాణ

telangana

ETV Bharat / international

మార్స్​పై రోవర్‌ దిగిన అద్భుత దృశ్యాలు - అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ

అంగారక గ్రహంపై వ్యోమనౌక 'పర్సెవరెన్స్'​ కాలుమోపిన అద్భుత వీడియోను విడుదల చేసింది నాసా. మూడు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో అరుణ గ్రహం ఉపరితలంపై ల్యాండ్​ అయిన క్షణాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను మీరూ చూసేయండి.

video of perseverance on mars
అంగారకుడిపై రోవర్‌ దిగిన వీడియో విడుదల

By

Published : Feb 23, 2021, 5:14 AM IST

Updated : Feb 23, 2021, 6:47 AM IST

అంగారకుడిపై ఒకప్పుడు జీవంజాలం ఉందా? లేదా? అని పరిశోధన చేసేందుకు అమెరికా పంపిన వ్యోమనౌక 'పర్సెవరెన్స్‌' ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాలకుపైగా నిడివిగల ఈ వీడియోలో 'పర్సెవరెన్స్‌' అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్‌ అయిన క్షణాలు రికార్డు అయ్యాయి. వీడియోను చూస్తూ నాసా శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఈ వీడియో, చిత్రాలు తమ కలల రూపంగా పేర్కొన్నారు.

అంగారకుడిపై రోవర్‌ దిగిన వీడియో విడుదల

వ్యోమనౌక ల్యాండవుతున్న సమయంలో అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, తాళ్ల సాయంతో రోవర్‌ కిందకి దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో హర్షించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పర్సెవరెన్స్‌ రోవర్‌ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగింది. ఆ వ్యోమనౌకలో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లును ఇంజినీర్లు అమర్చారు. వీటిలో 7 కెమెరాలను ల్యాండింగ్‌ సమయంలోనే రికార్డు చేయడానికి ఇంజినీర్లు స్విచ్‌ ఆన్‌ చేశారు. రానున్న కొద్ది రోజుల్లో రోవర్‌ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు, వీడియో రికార్డింగ్‌లను వెలువరిస్తామని చెప్పిన మూడు రోజులకే నాసా తాజాగా ఈ వీడియో విడుదల చేసింది. ఇప్పటికే పర్సెవరెన్స్‌ అరుణ గ్రహ ఉపరితలానికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలు పంపించింది.

ఇదీ చూడండి:మార్స్​పై క్రికెట్​ గ్రౌండ్​!.. ఐసీసీ ఆసక్తికర పోస్ట్​

Last Updated : Feb 23, 2021, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details